HNK: మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తని భార్య హత్య చేసిన సంఘటన ఇవాళ ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. రాజారావు అశోక్(31) పనులకు వెళ్తూ వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. తాగి వచ్చి భార్యను కొట్టడంతో సహనం కోల్పోయిన భార్య యాద లక్ష్మి భర్తను చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.