RR: ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో నాగార్జునసాగర్ హైవేపై సూచిర బార్ అండ్ రెస్టారెంట్ వద్ద మిషన్ భగీరథపైపు లీకై గత కొన్ని రోజులుగా నీరు వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ నీరు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కల్వర్ట్ వరకు సుమారు అర కిలోమీటరు మేర కొనసాగుతోంది. దీంతో రోడ్డు బురద మాయంగా మారీ, ఇబ్బంది తప్పటంలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.