HYD: మధురనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న జంట బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా గుర్తించారు. అక్టోబర్ 4న బల్బ్ మార్చే నెపంతో యజమాని అశోక్, ఎలక్ట్రిషియన్ చింటూ దీనిని అమర్చారు. అక్టోబర్ 13న దంపతులు సీక్రెట్ కెమెరా గుర్తించి యజమానికి ఫిర్యాదు చేయగా, చింటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యజమాని అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.