NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు ఎస్ఈ. జగదీష్ ప్రాజెక్టు వరద గేట్లను మూసివేసి, ప్రధాన కాలువలు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎగువ నుంచి ఉదయం 22 వేల క్యూసెక్కుల వరద చేరడంతో 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద 9,654 క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను మూసివేశారు.