సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకార యువకుడు చేప పోటుకు గురై మరణించిన ఘటన కర్ణాటకలో జరిగింది. కార్వారకు చెందిన అనిల్ మాజాళికర్(24) తన బృందంతో కలిసి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లాడు. వేట సమయంలో బోటు అంచున కూర్చోగా.. నీళ్లలోంచి ఎగిరి వచ్చిన ఒక చేప తన సూదంటి నోటితో అనిల్‌ను పొడిచింది. బాధితుణ్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.