KNR: శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి 33/11 కేవీ సబ్స్టేషన్లో ముత్తారం, తాడికల్ ఫీడర్లను వేరు చేస్తూ కొత్త బ్రేకర్లను ఏర్పాటు చేసినట్లు ఏఈ సంపత్ రెడ్డి తెలిపారు. కొత్త బ్రేకర్ల ఏర్పాటుతో ఓ ఫీడర్లో సమస్య తలెత్తినా, మరో ఫీడర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతరం కరెంటు సప్లై చేయడానికి దోహదపడుతుందని ఆయన వివరించారు.