కోనసీమ: ఆలమూరు మండలం జొన్నాడ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ రద్దయ్యింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థ దీని నిర్మాణం చేపట్టడానికి విముఖత చూపించడంతో కాంట్రాక్టర్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసి మరోసారి టెండర్లు పిలవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్లుగా వాటి పనులు నత్తనడకగా సాగుతూ ప్రజలకు, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా మారింది.