ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురంలో రేషన్ షాపు నెంబరు 39ను సివిల్ సప్లయ్ అధికారులు గురువారం రాత్రి సీజ్ చేశారు. సక్రమంగా రేషన్ ఇవ్వకపోవడంతో గ్రామస్తుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రేషన్లో అక్రమాలకు పాల్పడిన, సక్రమంగా అందించకపోయినా జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.