SRD: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం చేపట్టిన బంద్ జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బందుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారులు, వివిధ సంఘాల నాయకులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు.