NGKL: “రాహు-వీర్” పథకం మార్గదర్శకాల కరపత్రాలను జిల్లా SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. ఈ పథకం రోడ్డు ప్రమాదాల సమయంలో మానవతా విలువలను ప్రోత్సహించే ఒక ఆదర్శ ప్రణాళిక అని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలో ప్రమాద బాధితులను హాస్పిటల్లో చేర్చిన వారికి ‘రాహు- వీర్’ పథకం ద్వారా ప్రోత్సహకం అందించడం జరుగుతుందని తెలిపారు.