WNP: పానగల్ మహ్మదాపూర్ గ్రామంలో కేశనకుంటలో మొసలి ఉన్న విషయం తెలిసిందే. చేపల కోసం జాలర్లు వేసిన వలలో మొసలి పడింది. మొసలిని గ్రామస్థులు తాళ్లతో బంధించారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు దానిని బంధించి జంతు రక్షణ కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. చేపల వలలో మొసలి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి ఆసక్తిగా చూస్తున్నారు.