MDCL: భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టి, బోడుప్పల్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ చిన్న వెంకటేశ్ (27), 25 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చగా, అబార్షన్ మందులు ఇచ్చాడు. పెళ్లి గురించి నిలదీయగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.