BHPL: భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి ఉదయం పొలం వద్దకు నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. మోటార్ వద్ద ఉన్న విద్యుత్ వైరుకు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు తెలిపారు. యువకుడికి భార్య, సంవత్సరం వయసు కొడుకు ఉన్నారన్నారు. ఈ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.