సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలకు కూడేరు మండలం మరుట్ల గ్రామానికి చెందిన షణ్ముఖ రెడ్డి రెండు బీరువాలను వితరణ చేశారు. దాదాపు రూ. 20వేలు విలువ చేసే బీరువాలను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి గురువారం అందచేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నారాయణ స్వామి దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.