HNK: పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను గురువారం ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణ క్రమంగా డబ్బులు జమ అవుతున్నాయా లేదా ఆరాతీశారు. ఇటుక, కంకర, ఇసుక విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.