ADB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా చర్యలు చేపడుతున్నామని తాంసి ఎంపీడీవో మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని జామిడి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యాప్లో లబ్ధిదారుని వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీవోతో పాటు పంచాయతీ కార్యదర్శి కనక దుర్గ ఉన్నారు.