NTR: నందిగామ ప్రజలు ఏపీయస్ ఆర్టీసీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉదయం 7గం. నుండి 10 గం. వరకు, సాయంత్రం 4 – 6 గం.ల మధ్య నందిగామ నుంచి విజయవాడకు షటిల్ సర్వీస్ బస్సులను ప్రతి 10/15 నిమిషాలకు నడపాలని, నందిగామ పరిసర ప్రాంతాల ప్రజలు. పాలకులకు, ఏపియస్ ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కాగా, నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.