ప్రకాశం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం లభిస్తుందనే ఉద్దేశంతో ఆనాడు వైయస్ జగన్ నిర్మించారని వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం దర్శి మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.