NZB: నగరంలోని నాలుగవ డివిజన్ ప్రజలు ఎదురుచూస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు పనులు గురువారం పూర్తయ్యాయి. స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రత్యేక చొరవతో యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ రోడ్డు పనులు గత రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. గతంలో క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్లాలంటే రోగులు అనేక ఇబ్బందులు పడేవారు.