CTR: చిత్తూరు నీవా నది పరివాహక ప్రాంతంలో వరద నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ఇందులో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ మేరకు అధికారులు, టీడీపీ నేతలు సకాలంలో స్పందించి వరదల సమయంలో ఎటువంటి నష్టం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారని అభినందించారు.