NTR: జీ.కొండూరు మండలం వెంకటాపురం సమీపంలో గల ఒక ప్రైవేట్ కాలేజీ రోడ్డులో 9 మంది గంజాయి నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుల నుంచి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ వెల్లడించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.