ATP: ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి మంత్రులు సత్యకుమార్, పయ్యావుల కేశవ్ ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మంత్రులను ఎలా ఉన్నారంటూ పలకరించారు. కర్నూలులో జరుగుతున్న ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభకు జిల్లా నేతలంతా తరలివెళ్లారు.