NLG: నల్గొండలోని SC(A) సంక్షేమ హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని SFI జిల్లా అధ్యక్షులు నరేష్, కార్యదర్శులు శంకర్లు డిమాండ్ చేశారు. గురువారం నల్గొండలో వారు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి దళిత విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టకుండా SC సంక్షేమ హాస్టల్లోకి వచ్చే బియ్యాన్ని,ఇతర సామాగ్రిని వార్డెన్ బహిరంగ మార్కెట్లోకి అమ్మడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.