SKLM: ఎల్ఎన్ పేట మండల కేంద్రంలో గల మోడల్ ప్రైమరీ పాఠశాల ఆవరణలో గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహించారు. అక్టోబర్ 16వ తేదీన నిర్వహించే ఈ కార్యక్రమంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆహార పదార్థాలను వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. లయన్స్క్లబ్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక, గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.