కృష్ణా: మొవ్వ: మండల కేంద్రమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం మండల కమిటీ గురువారం డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా సీపీఎం మండల కమిటీ సభ్యులు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, పరిస్థితులను పరిశీలించారు. అనంతరం పలు పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.