BDK: పాల్వంచ మండలం తోగూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన మోడల్ న్యూట్రీ గార్డెన్ ను గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన సందర్శించారు. గార్డెన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసి పంచాయతీ కార్యదర్శి రవి కుమార్, సిబ్బందిని అభినందించారు. వారితోపాటు ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీవో చెన్నకేశవ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.