టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతాడా? లేక ముందుగానే రిటైర్ అయిపోతాడా? అన్న చర్చ జరుగుతున్న వేళ ఛేజింగ్ మాస్టర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘నిజంగా విఫలమయ్యేది వదిలేయాలి అని నిర్ణయించుకున్నప్పుడే’ అని రాసుకొచ్చాడు. దీంతో మెగా టోర్నీ వరకు కొనసాగుతానని కింగ్ కోహ్లీ పరోక్షంగా స్పష్టంచేశాడని ఫ్యాన్స్ చర్చించుకునంటున్నారు.