NLG: మర్రిగూడ మండల పరిధిలోని ప్రాథమిక, ఉన్నత, ఆదర్శ పాఠశాలలకు చెందిన 24 మంది మండల స్థాయి, ఏడుగురు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు బుధవారం అవార్డులను ప్రధానం చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంఈవో బిట్టు శ్రీనివాస్ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి అవార్డులు అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.