ప్రకాశం:పెద చెర్లోపల్లి మండలంలోని చింతగుంపల్లి గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో జీవీ కృష్ణారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకుని , కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు.