RR: బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తున్న 162 మందిని షీ టీమ్స్ పట్టుకున్నారన్నారు. వారికి ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారని తెలిపారు.