కృష్ణా: గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బాపులపాడుకు చెందిన గరికిపాటి సుబ్బారావుగా స్థానికులు గుర్తించారు. అతడు రైల్వే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడని చెప్పారు. మార్కెట్ నుంచి సరుకులు తీసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.