BPT: యద్దనపూడి మండలంలోని అనంతవరంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ జ్ఞాన సొసైటి అధ్యక్షుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా బహుజన నాయకుడు మైలా చిన నాగేశ్వరరావు తెలిపారు. సమావేశంలో ఓటు విలువ, బహుజనులు రాజ్యాధికారం విషయాలపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అద్దంకికి చెందిన బహుజన నాయకులు జ్యోతి రమేష్ బాబు తదితరులు పాల్గొననున్నారు.