E.G: జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి స్వామి వారి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి ప్రసాదాలు అందించారు.