TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో దారుణం జరిగింది. మేరుగుర్తి రమేశ్ అనే వ్యక్తి తన అన్న రమేశ్‌పై కత్తితో దాడికి దిగాడు. ఈ క్రమంలో అడ్డుగా వచ్చిన వదినపై వేటు వేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆమె.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ గొడవకు ఆస్తుల వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.