GNTR: అమృతలూరు (M) కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది. గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరుతో సమీప బంధువే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కా ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిన అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.