ప్రజలకు అందుబాటులో లేని వీఆర్వోపై చర్యలు తీసుకోవాలి అని గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు సాయిబాబా అన్నారు. పార్వతీపురం మండలం డి.కే పట్నం సచివాలయ పరిదిలో పనిచేస్తున్న వీఆర్వో కృష్ణారావు విధులు సక్రమంగా నిర్వహించటం లేదని, సచివాలయం నకు ఎప్పుడు వస్తారో తెలియదన్నారు. రెవెన్యూ సమస్యలపై గిరిజనలు సచివాలయంనకు వెలితే ఆయన ఉండరని పేర్కొన్నారు.