ప్రకాశం: ఎర్రగొండపాలెం టీడీపీ నాయకులు, అధికారులు జీఎస్టీపై గురువారం బంగ్లా నుండి అంబేద్కర్ విగ్రహ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానం ప్రజలకు మేలు జరగడం హర్షనీయమని ఏఎంసీ ఛైర్మన్ చేకూరి సుబ్బారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంచర్ల సత్యనారాయణ గౌడ్, చిట్యాల వెంగల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.