కోనసీమ: ఆలమూరు శ్రీదేవి,భూదేవి సమేత జనార్ధనస్వామివారి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు గురువారం శాంతి కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు కె.వి.ఎస్ ప్రభాకరాచార్యులు, సాయి భగవాన్ ఆచార్యుల ఆధ్వర్యంలో వేదోక్తంగా, అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు.