భారత్ తన సైనిక శక్తిని పెంచుకోవడంతో ప్రపంచంలో మూడో అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా అవతరించింది. తాజా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్(WDMMA) ర్యాంకింగ్స్లో చైనాను వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో అమెరికా, రష్యాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చైనా నాలుగో స్థానానికి పడిపోయింది.