SKLM: నరసన్నపేటలో బుధవారం అర్ధరాత్రి సమయంలో భవనం కూలి పలువురికి తీవ్ర గాయాలు అవడంపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఆరా తీశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మాట్లాడారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణాల భద్రత ప్రమాణాలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.