ADB: బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని CPI(ML) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగన్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం సమావేశమై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలని కోరారు.