కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు గురువారం శత్రుస్థాన అర్చన, విశేష హోమం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి 27 కళశాలతో స్నపన తిరుమంజనం, ప్రాయశ్చిత్త హోమం కార్యక్రమాలను వేద మంత్రాలతో వైభవోపేతంగా జరిపించారు. త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి శిష్య బృందం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలను జరిపించారు.