ELR: ఏలూరులో సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన జీఎస్టీలో వివిధ రకాల వాహనాల కొనుగోలుపై 5 శాతం నుంచి 25 శాతం వరకు లాభం ఉందన్నారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా రవాణా శాఖ అధికారి కరీం, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.