W.G: తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. దెందులూరు నుంచి కానూరు వైపు వెళ్తున్న కారు తేతలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద స్కూటీపై రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.