KMM: గుజరాత్ రాష్ట్రంలోని పర్యాటక స్థలాలకు వెళ్లే వారి కోసం SCR ‘భవ్య గుజరాత్’ పేరిట ప్రత్యేక రైలు నడిపిస్తోంది. రేణిగుంట నుంచి బయలుదేరే ఈ రైలు తొమ్మిది రోజుల యాత్ర ఉంటుంది. గుజరాత్లోని ద్వారక, సోమనాధ్, మోడేరా, రాణీ కి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తదితర స్థలాలు సందర్శించవచ్చు. ఖమ్మం మీదుగా వెళ్లే ఈ రైలును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.