NLR: బుచ్చిరెడ్డిపాళెం సీఐటీయు ఆధ్వర్యంలో మధ్యాహ్నం పథకం కార్మికులు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం ఎంఈవో దిలీప్ కుమార్కు వినతిపత్రం. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన వేతనాలు, బిల్లులు ఇప్పటివరకు జమ కాలేదని జమైనట్లు మెసేజ్లు వస్తున్నాయని తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు.