GNTR: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సందీప్ బాబు తెలిపారు. అందుకు సంబంధించిన శిక్షణా సంస్థను కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఇవాళ పాల్గొని ప్రారంభించారు. నవంబర్ 3వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం మొదలవుతుందని, ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె వెల్లడించారు.