JNG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా డిమాండ్ చేశారు. ఇవాళ పాలకుర్తి మండల కేంద్రంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినా కేంద్రం నిర్లక్ష్యం చూపడం ద్రోహాత్మక చర్యగా విమర్శించారు. ఈ నేల 18న జరిగే రాష్ట్ర బంద్కు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు.