NLG: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా శ్రేణులు సిద్ధంగా ఉండాలని చిట్యాల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ పిలుపునిచ్చారు. గురువారం జరిగిన మండల స్థాయి జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలని అన్నారు.