VSP: దేశీయ టూర్లో భాగంగా కేఎల్ యూనివర్సిటీకి చెందిన బీఏ-ఐఏఎస్ విద్యార్థులు విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ను కలుసుకుని నగర యోజన, అభివృద్ధి, ప్రజా సదుపాయాలు, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఛైర్మన్ వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.